ఒకప్పుడు వరుస హిట్లతో క్రేజ్ తెచుకున్న, శ్రీను వైట్లకి ఆ తర్వాత వరుస పరాజయాలతో కాలం కలిసి రాలేదు. 2018లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫలితం కూడా అతన్ని నిరాశపరిచింది. ఆ తర్వాత ఆయన నుంచి ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఇప్పుడు గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీను వైట్ల – గోపీచంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మేకింగ్ వీడియో కొద్దిసేపటి క్రితం విడుదలైంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోందని ఈ వీడియో వెల్లడించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, చాలా వరకు విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారని అర్థమవుతోంది. ట్రైన్‌లో కామెడీ ఎపిసోడ్‌ని మరోసారి ప్లాన్ చేశాడు శ్రీను వైట్ల. కావ్యా థాపర్ కథానాయికగా అలరించనుంది. మరి శ్రీను వైట్ల, గోపీచంద్ ఇద్దరికీ ఈ సినిమా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.