రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఇటీవల జరిగిన మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఫస్ట్ సాంగ్ తో ఆకట్టుకున్నారు. తాజాగా ‘రెప్పల్ డప్పుల్’ అనే రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటను మిక్కీ జె మేయర్ కంపోజ్ చేశారు మరియు అనురాగ్ కులకర్ణి మరియు మంగ్లీ పాడారు. కాసర్ల శ్యామ్ ‘బొమ్మ సోకులో..బొంబాయి జాతరే..బచ్చన్ గొంతులోన బప్పి లహరే..ఉస్కో అని అంటేనే చాలు..డిస్కోల మోతారే..తెల్లార్లు చల్లారని గాన కచ్చేరే..’ అంటూ ఆకట్టుకునే సాహిత్యం రాశారు. తెలుగు, తమిళం, హిందీ.. వలపు జుగల్ బందీ.. తకిట తకిట చమట బొట్టు తాళమేస్తదే’ ఈ పాటలో రవితేజ, భాగ్యశ్రీ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. జగపతి బాబు మరియు సచిన్ ఖేద్కర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను పనోరమా స్టూడియోస్, టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది.