టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, హాలీవుడ్ విజువల్ వండర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ మూవీ లయన్ కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1994లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే, ఇప్పుడు ‘ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ వస్తున్న విషయం తెలిసిందే.. ముఫాసా అసలు లయన్ కింగ్ ఎలా అయ్యాడన్న బ్యాక్ డ్రాప్ ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బారీ జెంకిన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండనుంది. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మన దేశంలో కూడా హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే హిందీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా. తాజాగా తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదల చేసారు.