ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప: ది రూల్’ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మరో 75 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకునేలా మేకర్స్ డిజైన్ చేశారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్లు పుష్ప-2పై భారీ అంచనాలు పెంచేశాయి. దీంతో ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి, ఇప్పుడు డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నధం అవుతుంది.
అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు . ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో గ్రాండ్ మూవీ రూపొందుతుంది.