నమ్రతా శిరోద్కర్ జయంతి సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో ఎంబి ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో కీలకమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను అందించడం ద్వారా యువతుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు అద్భుత స్పందన లభించింది. బుర్రిపాలెం గ్రామంలోని దాదాపు 70 మంది బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ మొదటి డోసును ఇచ్చారు. దీని కారణంగా గర్భాశయ క్యాన్సర్ నుంచి ఆ బాలికలు రక్షించబడతారని నమ్రత తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ఫౌండేషన్ మరియు హాస్పిటల్ సిబ్బందికి నమ్రతా శిరోద్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడంలో అవగాహన మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. MB ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.