IIFA 2024 అబుదాబిలో వైభవంగా జరిగింది. ఈ భారతీయ చిత్ర పరిశ్రమలన్నింటికీ సంబంధించిన అనేకమంది హీరోహీరోయిన్లు హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ విభాగాల్లో సీనియర్ హీరోలు అవార్డులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ అవార్డును అందుకున్నారు. టాలీవుడ్ పెద్ద హీరో నందమూరి నటసింహగా పేరొందిన బాలకృష్ణ “గోల్డెన్ లెగసీ” అవార్డు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి అవార్డు అందుకున్న సమయంలో టాలీవుడ్ బడా హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి ఒకే స్టేజిపై కనబడడంతో అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఉండి ఉంటే మరింత బాగుండేది అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.