నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం హిట్ 3. దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ 2025 మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, మేకర్స్ ఈరోజు ఏప్రిల్ 14న హిట్ 3 ట్రైలర్‌ను విడుదల చేశారు. నానిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం. క్లాస్, మాస్ సినిమాలు తీసే నాని ఇప్పుడు వైలెన్స్‌కే వణుకు పుట్టించేలా ఉన్నాడు. ట్రైలర్‌లోని కొన్ని షాట్లు ఉత్కంఠభరితంగా ఉన్నాయి.
ముఖ్యంగా అర్జున్ సర్కార్‌గా నాని ఆటిట్యూడ్ పీక్స్ అనే చెప్పాలి. కొన్ని వినకూడని డైలాగ్స్‌ని కూడా కట్ లేకుండా పెట్టేశారు. ఇక శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఒకేలా వరుస హత్యలు జరుగుతుండడం ఆ కేసును అర్జున్ సర్కార్‌కు అప్పగించడం ఈ క్రమంలో ఆయన చేసిన వైలెన్స్ ఆ కేసును ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. ఓవరాల్ గా హిట్ 3 టీజర్ మాత్రం సినిమా పై అంచనాలను పెంచేసేలా ఉంది. నాని ఈసారి తన ఫ్యాన్స్‌కు ఊరమాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ.