కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసి ఎంతగానో క్రేజ్ తెచుకున్న డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌‌ మన అందరికి తెలుసు. డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌‌, జూనియర్ ఎన్టీఆర్‌ తో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్‌తో రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో ఘనంగా ఈ సినిమా మొదలైంది. ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ ఇరువురి కుటుంబసభ్యులు ఈ ఈవెంట్​కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మైత్రి మేకర్స్ సోషల్ మీడియాలో మ్యాన్ అఫ్ ది మాస్సెస్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబోలో మరో బ్లాక్బ్ బస్టర్ చిత్రం ఎన్టీఆర్ 31 రాబోతుంది. ఈ చిత్రం జనవరి 9, 2026 న చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు. ఈ తాజా అప్డేట్ తో ఎన్టీఆర్ అభిమునులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

ఈ పూజా కార్యక్రమం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘NTR Neel’ హ్యష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నటు సమాచారం దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్డెట్‌తో నిర్మించబోతుంది. ఇక కేజీఎఫ్, సలార్‌లానే ఈ సినిమాను కూడా ప్రశాంత్‌ నీల్‌ రెండు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నారట. తారక్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ప్రశాంత్ నీల్ కూడా సాలార్ 2 పనిలో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ 31 సినిమా రెగ్యులర్ షూటింగ్ పై సినీ సర్కిల్ నుండి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *