Nithya Menon: విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జోడీ మరోసారి హిట్ కొట్టారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన “తలైవన్ తలైవీ” సినిమాతో ఈ ఇద్దరూ తిరిగి విజయం సాధించారు. ఈ మూవీకి ముందు వీరిద్దరికీ సరైన విజయం దక్కలేదు. విజయ్ సేతుపతి “ఏస్” సినిమా పెద్దగా ఆడలేదు. నిత్యామీనన్ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమా ఫలితం కూడా నిరాశ పరచింది. జాతీయ అవార్డు అందుకున్న “తిరుచిత్రాంబలం” తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న నిత్యా, జయం రవితో చేసిన “కాదలిక్క నేరమిల్లే” చిత్రంతో మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే అది కూడా ఫ్లాప్ అయ్యింది.
ఈ నేపథ్యంలో జులై 25న తమిళంలో మాత్రమే విడుదలైన “తలైవన్ తలైవీ” ఘన విజయం సాధించింది. ఇప్పటికీ తమిళంలో రూ. 30 కోట్లు వసూలు చేసి మంచి టాక్‌ను కొనసాగిస్తోంది. ఆగస్టు 1న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు “సార్ మేడమ్” పేరుతో రాబోతోంది. భీమ్లా నాయక్ తర్వాత నిత్యా తెలుగులో కనిపించలేదు. అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే దర్శనమిస్తోంది. ఇక దసరా సమయంలో ధనుష్‌తో కలిసి మరో సినిమాతో బాక్సాఫీస్‌ను కుదిపేయాలని నిత్యా సిద్ధమవుతోంది. “ఇడ్లీ కడాయ్” అనే డ్రామా ఫిల్మ్‌తో త్వరలో రాబోతోంది. ఇటీవల ఈ చిత్రానికి చెందిన మొదటి లిరికల్ సాంగ్ విడుదలై మంచి స్పందనను రాబట్టింది. గతేడాది ప్రకటించిన “డియర్ ఎక్సెస్” అనే రామ్ కామ్ సినిమా ఆగిపోయిందని కూడా నిత్యా క్లారిటీ ఇచ్చింది.
Internal Links:
కింగ్‌డమ్ కొత్త సాంగ్ గూస్బంప్స్..
మొదలైన రష్మిక మందన్న మైసా మూవీ షూటింగ్..
External Links:
తమిళంలో మరో హిట్ కొట్టేసిన నిత్యామీనన్.. నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్