News5am, Breaking News Telugu (15-05-2025): ‘RRR’ మూవీతో తారక్ రేంజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు ఆయన ‘దేవర’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో కూడా నటిస్తున్నారు, ఇది ఆగస్టులో విడుదల కానుంది. తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే ‘దేవర 2’కు కూడా తారక్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ హల్చల్ చేస్తోంది. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు వెనుక రాజమౌళి, కార్తికేయ, వరుణ్ గుప్తాల ప్రమేయం ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే కథా రచన పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ కథ విన్న జూనియర్ ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా స్పందించి వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. భారతీయ చలనచిత్ర రంగం ప్రయాణాన్ని వివరించేలా ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే సినిమాను రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. దీనిని దర్శకుడు నితిన్ కక్కర్ రూపొందించబోతుండగా, రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పించనున్నారు. అప్పట్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించనున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఎంతో ప్రాముఖ్యత గలది. అలాంటి ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ లాంటి నటుడు అయితే తప్పకుండా న్యాయం చేస్తారని భావిస్తున్నారు. ఇండియన్ సినిమా ఎలా పుట్టింది, ఎలా ఎదిగింది, మధ్యలో ఏలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నది ఈ సినిమాలో చూపించనున్నారు.
More Breaking News:
Breaking News Telugu
సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి
వెస్టిండీస్ హిట్టర్ భారత్‌కు వచ్చేశాడు
More News: External Sources
https://ntvtelugu.com/movie-news/cinema-news/ntr-ntr-in-dadasaheb-phalke-biopic-799374.html