కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రం కోసం, తారక్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పాటలకు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, సెప్టెంబర్ 10న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజగా మేకర్స్ ట్రైలర్ టైం రివీల్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నారు.
టైమింగ్ తో పాటు దేవర నుంచి మరో కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు మరింత జోష్ పెంచారు. దేవర టీం పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఆకాశం వణికిపోతోంది, అలలు ఎగసిపడుతున్నాయి, తుఫాను నుండి రక్తం కారుతోంది, అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణహోమానికి సంకేతాలు – దేవర, వార రాబోతున్నారు అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తుంది.