‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో రాఖీ భాయ్‌గా దేశ వ్యాప్తంగా తిరుగులేని అభిమానులను సంపాదించుకున్నాడు క్రేజీ స్టార్ యష్. ఈ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ వైపు యావత్ భారతం ఆశ్చర్యంతో చూసింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అదుకని ఆలోచించి ఫైనల్‌గా లేడీ డైరెక్టర్‌తో ‘టాక్సిక్’ మూవీకి శ్రీకారం చుట్టిన యష్ అదే జోష్‌తో మరో మహత్తర సినిమాకు పూనుకున్నారు అదే ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ భారీ మూవీని తన స్నేహితుడితో కలిసి యష్ కూడా నిర్మిస్తున్నారు.
ఇక రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తుండగా రావణ బ్రహ్మ పాత్రలో యష్ నటిస్తున్నారు. బాబిడియోల్ హనుమంతుడిగా కనిపించనున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అయితే తాజాగా ‘రామాయణ’ కోసం అన్నగారు ఎన్టీఆర్ సెంటిమెంట్ ఫాలోఅవుతున్నారట యష్. ఇంతకీ ఏంటా సెంటిమెంట్ అంటే.. చాలా వరకు పౌరాణిక సినిమాల్లో నటించే సమయంలో, రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా మన నటులు నియమ నిబంధనలు పాటించేవారట. ఈ విషయంలో అన్నగారు ఎన్టీఆర్ చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన నటించిన పౌరాణిక సినిమాల సమయంలో పాత్రని బట్టి ఆయన చాలా నిష్టగా ఉండేవారట. ఆయన సెంటిమెంట్‌ని కొంత మంది ఇప్పటికి పాటిస్తున్నారు. దీంతో తొలి సారి రావణుడి పాత్ర కోసం యష్ కూడా ఆనాటి సెంటిమెంట్‌ని పాటిస్తుండటం విశేషం.