ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
“నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలి” అని ఎన్టీఆర్ తన ట్వీట్ లో రాశారు.