కరోనా టైంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ సినిమాకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ సినిమా రూపొందుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తుంది.సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్ అయింది.

ఇక నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా ఉంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ టీజర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అంచనాలు పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ టీజర్ కట్‌ను మేకర్స్ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *