OG Vs Akhanda 2: ఈ ఏడాది వేసవిలో స్టార్ హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేయకుండా అవకాశాన్ని వదులుకున్నారు. ఇప్పుడు అయితే పరిస్థితి మారింది. సెప్టెంబర్‌లో ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 మరియు పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలు రేస్‌లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎవరి సినిమా వాయిదా పడుతుందో అని అభిమానులు వాదోపవాదాలు చేస్తున్నారు.
ఇదే సమయంలో, నిన్న అఖండ 2 వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అఖండ 2 షూటింగ్ పూర్తికాలేదని, ఇంకా 11 రోజుల మేజర్ షెడ్యూల్ మిగిలి ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుందని, ముఖ్యంగా VFX కీలక పాత్ర పోషించబోతుందని రూమర్లు వచ్చాయి. దీంతో సినిమా డిసెంబర్‌కు వాయిదా పడుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైందని, డబ్బింగ్ కూడా వేగంగా జరుగుతోందని చెప్పారు. ఆగస్టు 15 నాటికి ఫస్ట్ కాపీ, సెప్టెంబర్ 1 నాటికి ఓవర్సీస్ కాపీ రెడీ అవుతుందని, మునుపే ప్రకటించినట్టే సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అవుతుందని ధృవీకరించారు. అదే తేదీకి OG కూడా సిద్ధంగా ఉంది. రెండు సినిమాలు ఒకే రోజు వస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, ఒక రోజు గ్యాప్‌తో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ఎవరు ముందుగా వస్తారు, ఎవరు వెనక్కి వెళ్తారో చూడాలి.
Internal Links:
సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్..
అంచనాలను దాటేసిన ‘పెద్ది’ బడ్జెట్..
External Links:
OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్ గోల