తమిళ స్టార్ ధనుష్ నటించిన రాయన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించాడు ధనుష్. ధనుష్ హీరోగా 50వ సినిమా కావడంతో రాయన్ పై మరింత ఆసక్తి నెలకొంది. అంచనాలకు తగ్గట్టుగానే రాయన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఈ రాయన్ సినిమా OTTలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఆగస్ట్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియో OTTలో రాయన్ సినిమా స్ట్రీమింగ్ కానుంది.ఆగస్ట్ 30న సినిమాను విడుదల చేసేందుకు ప్రైమ్ వీడియో ప్లాన్ చేస్తోంది.ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రారంభంలో, Sunnext OTT కూడా రాయన్ OTT హక్కులను పొందినట్లు నివేదించబడింది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోతో పాటు సన్‌నెక్స్ట్ OTTలో ప్రసారం అవుతుందని భావిస్తున్నారు. మరి.. రెండు ఓటీటీల్లో ఈ చిత్రం అడుగుపెడుతుందా అనేది చూడాలి.