News5am, Breaking News Telugu News (06/05/2025): హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందిన సినిమా “జాక్”. హీరోయిన్గా తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి హిట్ సినిమాతో గుర్తింపు పొందిన సిద్ధు నటించిన తదుపరి చిత్రం కావడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా అడ్వాన్సులు చెల్లించారు. సినిమాకి మంచి ఓపెనింగ్ ఉంటుందని అంచనా వేశారు. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా బయ్యర్లను తీవ్రంగా నిరాశపరిచింది.
స్పై యాక్షన్ కామెడీ జానర్లో తెరకెక్కిన “జాక్” తొలి షో నుంచే నెగటివ్ టాక్‌ను ఎదుర్కొని పూర్తిగా ఫ్లాప్ అయింది. ఓపెనింగ్స్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను విడుదలకు ముందే భారీ ధరకు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది. లేకపోతే నిర్మాతకు తీవ్ర నష్టం వచ్చేది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను మే 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు తీసుకువస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. థియేటర్లలో ఫలితం అందుకోలేకపోయిన జాక్ ఓటీటీలో ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో వేచి చూడాలి. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్‌తో బొమ్మరిల్లు భాస్కర్ కి మరో ఫ్లాప్ జతకాగా, మేకింగ్ సమయంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ పూర్తిగా ప్రమేయం చూపాడన్న గాసిప్ టాలీవుడ్లో జోరుగా వినిపిస్తోంది.
More News:
Breaking News Telugu:
ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ…
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి..
More Breaking Big News: External Sources
OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న రీసెంట్ డిజాస్టర్