Paradise Nani First Look: నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, SLV బ్యానర్‌పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ‘హిట్ 3’ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
ఇటీవల మేకర్స్ ఈ చిత్రంలోనుంచి నేచురల్ స్టార్ నాని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రెండు పొడవాటి జడలతో రగ్గ్డ్ లుక్‌లో నాని ఆకట్టుకున్నాడు. అలాగే, ఈ సినిమాలో నాని పాత్ర పేరు ‘జడల్’ అని కూడా వెల్లడించారు. పోస్టర్‌లోనే ఇంటెన్స్ ఫీల్ రానిచ్చాడు నాని. ఈసారి నేచురల్ స్టార్ నుంచి మోస్ట్ వైలెంట్ స్టార్‌గా మారబోతున్నాడు. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ, టాలీవుడ్ సమాచారం ప్రకారం దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. తన రెండవ చిత్రమైన ‘ది ప్యారడైజ్’లో నానిని ఎన్నడూ చూడని విధంగా చూపిస్తానని శ్రీకాంత్ ఓదెల నమ్మకంగా చెబుతున్నారు. తమిళ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రాబోతుంది. సమ్మర్ స్పెషల్‌గా వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Internal Links:
‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్..
పరదా మూవీ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్..
External Links:
‘ది ప్యారడైజ్’.. నానిఫస్ట్ లుక్.. ‘జడల్’ చూస్తే హడల్