మెగా హీరో సాయిధరమ్ తేజ్ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తండ్రీ కూతుళ్లను కించపరుస్తూ వీడియో తీసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై చర్యలు తీసుకోవాలని ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సాయిధరమ్ తేజ్ అందరిలోనూ స్ఫూర్తి నింపారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం హనుమంతరావుపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి పావలా శ్యామల ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఆయన తన వంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పావలా శ్యామ్‌కి ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ సాయం అందజేసింది.
కష్టకాలంలో సాయిధరమ్ తేజ్ ఆర్థికంగా ఆదుకోవడంతో పావలా శ్యామల భావోద్వేగానికి గురయ్యారు, వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటానని సాయిధరమ్ తేజ్ వీడియో కాల్‌లో తెలిపారు. సాయిధరమ్ తేజ్‌కి ప్రమాదం జరిగినప్పుడు ఆయన బాగుండాలని, ఏమీ కాకుండా త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నట్లుగా పావలా శ్యామల గారు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆర్థిక సహాయాన్ని గుర్తు చేసుకున్నారు. పావలా శ్యామల మాటలు విన్న సాయిధరమ్ తేజ్ భావోద్వేగానికి లోనయ్యారు.