జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్‌ను ఆయన ఫ్యాన్స్ పవన్ స్టార్, జనసేనానిగా పిలుచుకుంటారు. ఇటీవలే జనసేన పార్టీ నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఆ టైమ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా ఏదియైన ఉంది అంటే అది గబ్బర్ సింగ్. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దబాంగ్ కు రీమేక్. కానీ పూర్తిగా హరీశ్ శంకర్ స్టైల్లో కనిపిస్తుంది. పవన్ కు అంతకు ముందు డజనుకు పైగా ఫ్లాపులు ఉన్నాయి. కాకపోత జల్సా కాస్త ఫర్వాలేదు అనిపించుకుంది. ఆ టైమ్ లో వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది.
మూవీని రీ రిలీజ్ చేస్తుండడంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు, రెండు మూడు రోజులు ముందు నుంచే హడావిడీ మొదలుపెట్టేశారు. ఆల్రెడీ చాలా థియేటర్స్ లో గబ్బర్ సింగ్ ఫ్లెక్సీలు వెలిశాయి. అభిమానులు బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఈ మూవీకి రికార్డ్ కలెక్షన్స్ కట్టబెట్టేలా ప్రయత్నాలూ చేస్తున్నారు.