పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆయన మూడు సినిమాల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ ఈ మూడు చిత్రాల షూటింగ్ కొంతమేర పూర్తయింది. అయితే, ఈ మూడింటిలో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా మాత్రం ఓజీ. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత రవిశంకర్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఆయన తాజాగా ‘మత్తు వదలరా-2’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓజీ సినిమా గురించి తలెత్తిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
రవిశంకర్ మాట్లాడుతూ “ఇటీవలే మేము పవన్ కల్యాణ్‌ను కలిశాం. మరికొద్ది వారాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభం కానుంది. జనవరి 2025 నాటికి తాలూకు షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం.సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పూర్తయిన పార్ట్ నుంచి అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాం. పవన్ అభిమానులు, రవిశంకర్ ప్రసంగానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో మన హీరో బరిలోకి దిగబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.