అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప2 ది రూల్. నిన్న బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప-2 ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే అంటే అతిశయోక్తి కాదు. ఎవడ్రా వాడు డబ్బంటే లెక్కలేదు పవర్ అంటే భయం లేదు అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
ఇలా పవర్ ఫుల్ డైలాగులతో పుష్ప-2 ట్రైలర్ ఉర్రూతలూగిస్తోంది. అల్లు అర్జున్ హీరోయిజం తొలిపార్టును మించిపోయిందన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పుష్ప ది రైజ్ లో చివర్లో కాసేపు కనిపించి ఎవడ్రా వీడు అనిపించిన ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్ లో ఫుల్ టైమ్ కనిపించనున్నాడు. దాంతో ఎంటర్ టైన్ మెంట్ ఏ రేంజిలో ఉంటుందో అని అభిమానులు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు.