రాజ్ తరుణ్-లావణ్య కేసు డైలీ సీరియల్ లా కొనసాగుతోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వాడుకున్నాడని, ఇప్పుడు మాల్వీ మల్హోత్రాతో సహజీవనం చేసి డ్రగ్స్ కేసులో ఇరికించాడని రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే, రాజ్ తరుణ్ మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేసింది లావణ్య. మరోవైపు లావణ్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఆరోపణల్లో నిజం లేదని, డ్రగ్స్ బానిస అని, డబ్బు కోసమే ఇలా చేస్తోందని రాజ్ తరుణ్ అన్నారు.
తాజాగా నార్సింగి పోలీసులు లావణ్యతో రాజ్ తరుణ్ కి సంబంధించిన వాటి కోసం, లావణ్య ఇంటి నుంచి ఆధారాలు సేకరించి రాజ్ తరుణ్ పై చార్జ్ షీట్ దాఖలు చేసి నిందితుడిగా చేర్చారు. మరోవైపు ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్ తన వద్ద ఉన్న బంగారం, తాళి బొట్టును దోచుకున్నాడని లావణ్య, నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లావణ్య బంగారం కొనుగోలు చేసిన నగల దుకాణం బిల్లులతో పాటు పీఎస్‌కు అందించింది. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య, ఆభరణాలను బీరువాలో దాచానని, బీరువా తాళం రాజ్ తరుణ్ వద్ద ఉందని, నాకు తెలియకుండా రాజ్ తరుణ్ దొంగిలించాడని పలు ఆధారాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది.