పాన్ ఇండియా స్టార్ అంటే ముందుగా గుర్తుగా వచ్చేది రెబెల్ స్టార్ ప్రభాస్. ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాతో భారీ 1100 కోట్ల హిట్ కొట్టి బోలెడన్ని రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. కల్కి విజయంపై ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్కి సినిమా తర్వాత కూడా ప్రభాస్ కి భారీ లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజాసాబ్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ చాలా క్రొత్తగా బాగుంది. దీంతో ఈ గ్లింప్స్ ప్రస్తుతం సాంఘిక ప్రసార మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. ఈ గ్లింప్స్ చూసాక ప్రభాస్ అభిమానులు వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అబ్బబ్బా.. ‘రాజాసాబ్’ గ్లింప్స్‌లో ప్రభాస్ భలే ఉన్నాడబ్బా. చానాళ్ల తరువాత.. కత్తులు, కారులు పక్కనపెట్టి చాలా ఏళ్ల తరువాత ప్రభాస్ ‘డార్లింగ్’ పూలు పట్టుకున్నాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ని చూడడానికి వెయ్యి కళ్ళతో అభిమానులు ఎదురు చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘రాజాసాబ్’. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కానుంది అని మేకర్స్ తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *