70 ఏళ్లు దాటిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని అందరు హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన తన తాజా చిత్రం ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ నిన్న ప్రారంభమైందని, షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడే పూర్తయిందని వార్తలు వచ్చాయి. రజనీకాంత్ అభిమానులే కాదు, కోలీవుడ్, టాలీవుడ్ మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా వార్త ఏమిటంటే ఈ సినిమా ప్రీ-రిలీజ్ మునుపెన్నడూ లేని స్థాయిలో జరిగింది.
అలా ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమాకు విడుదలకు ముందే, దాదాపుగా రూ.750 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట. కోలీవుడ్‌లో ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుగా చెపోచ్చు. తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌ని నాగవంశీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో విడుదల తర్వాత ‘కూలీ’ చిత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరుతుందని బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మూవీ యూనిట్.