Ram Charan’s Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో రామ్ చరణ్ ఈ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టారు. భావోద్వేగం, క్రీడాస్ఫూర్తి, ఐక్యత, గర్వం కలిపిన కథతో, తన కమ్యూనిటీకి స్ఫూర్తిదాయకంగా ఉండే పల్లెటూరి యువకుడిగా రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.
ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. ఇప్పటికే రూ. 250 కోట్లను దాటినట్టు టాక్, 1980 నాటి విజయనగరాన్ని పోలిన భారీ సెట్‌ను హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్నారు. గ్రామం, రైల్వే స్టేషన్, క్రీడా మైదానం వంటి సెట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరక్షన్ అందించగా, మైత్రీ మూవీ మేకర్స్, విరిధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, జగపతిబాబు, దివ్వేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం ఎ.ఆర్. రెహమాన్ అందిస్తుండగా, శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే ఆయన లుక్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Internal Links:
విశాఖలో ‘అల్లు అర్జున్’ మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం..
External Links:
అంచనాలను దాటేసిన ‘పెద్ది’ బడ్జెట్.. హైదరాబాద్ శివార్లలతో భారీ సెట్టింగ్ !