టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న RAPO 22 చిత్రంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరో. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని మరియు రవిశంకర్ యెలమంచిలి నిర్మాతలు. ఇది రామ్ కి 22వ సినిమా మరియు రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ పరాజయం తర్వాత, ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎప్పటినుండో సీనియర్ నటుడి కోసం అనేక పేర్లు పరిశీలిస్తున్నారు. మొదట ఈ పాత్ర కోసం గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. అలాగే మోహన్ లాల్, సూపర్ స్టార్ రజనీకాంత్, శివరాజ్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. కానీ వారెవరు ఫైనల్ కాలేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కన్నడ రియల్ స్టార్ ను సంప్రదించారట మేకర్స్. ఇప్పటికే ఈ విషయమై ఉపేంద్రతో దర్శకులు చర్చలు జరిపారట. సినిమాలో ఆయన పాత్ర వంటివి వివరించగా క్యారెక్టర్ నచ్చడంతో అందుకు ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుండగా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమిళ ద్వయం వివేక్‌ – మెర్విన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *