సినీ నటిగా, టీవీ యాంకర్‌గా రష్మీకి భారీ ఫాలోయింగ్ ఉంది. రష్మీ యాంకరింగ్‌తో పాటు గ్లామర్ షోలు చేస్తూ బిజీగా ఉంది. రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ఫోటోలను పంచుకుంటుంది మరియు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా తెలియజేస్తుంది.
తాజాగా రష్మీ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రష్మీ తన భుజానికి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధం అయ్యానని తెలిపింది. భుజం సమస్య కారణంగా తనకు ఇష్టమైన డ్యాన్స్ చేయలేకపోతున్నానని చెప్పింది. సర్జరీ అయ్యాక అంతా సెట్ అవుతుందని, మళ్లీ డ్యాన్స్ చేయగలుగుతానని తెలిపింది. రష్మీ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.