Rashmika Mandanna’s Maisa: రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’కి పూజా కార్యక్రమాలతో శుభారంభం చేశారు. ఈ చిత్రంతో హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా, రవి కిరణ్ కోలా కెమెరా స్విచాన్ చేశారు. హను రాఘవపూడి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేయడంతో పాటు ముహూర్తపు సీన్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో మొదటి షెడ్యూల్‌లో రష్మికతో పాటు మొత్తం టీమ్ పాల్గొంటోంది. గోండ్ తెగల నేపథ్యంతో రూపొందుతున్న ఈ హై-ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మికను ఇప్పటివరకు కనిపించని రఫ్, ఇంటెన్స్ అవతార్‌లో చూపించనున్నట్టు మేకర్స్ తెలిపారు. త్వరలోనే మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్‌ను బయటపెడతామని చెప్పారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి క్రేజ్‌ను తెచ్చింది.
Internal Links:
‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు.
External Links:
మొదలైన రష్మిక మందన్న మైసా మూవీ షూటింగ్..