మాస్ మహారాజా రవితేజ, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నా సినిమా మిస్టర్ బచ్చన్. మిరపకాయ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే తెలుగులో ఈ చిత్రంతోనే పరిచయం అవుతుంది. ఎంతగానో ఎదురు చూస్తున్నమిస్టర్ బచ్చన్ ట్రైలర్ రాణే వచ్చింది. సరిహద్దు కాపాడేవాడే కాదు, సంపద కాపాడే వాడు కూడా సైనికుడే” అంటూ డైలోగ్ తో ట్రైలర్ షురూ అయింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఆదాయపు పన్ను శాఖ అధికారిగా నటించారు.
మిస్టర్ బచ్చన్ ట్రైలర్లో రవితేజ యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్వాగ్ అదిరిపోయాయి. ఈ మూవీ ఎంత ఎంటర్‌టైనింగ్‍గా ఉంటుందో ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో రవితేజ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ బాగున్నాయి. జగపతి బాబు పవర్ ఫుల్ విలన్ గా కీలక పాత్రా పోషించారు. భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. రవితేజ, భాగ్యశ్రీ కెమిస్ట్రీ బాగుంది. ఈ ట్రైలర్ చూసాక మాస్ మహారాజా రవితేజ అభిమానులు బ్లాక్ బస్టర్ పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.