Samyuktha Menon in Akhanda 2: ‘బింబిసార’, ‘విరూపాక్ష’, ‘డెవిల్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందిన మలయాళ నటి సంయుక్త మీనన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘అఖండ 2’, ఇందులో ఆమె ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండటంతో పాటు స్పెషల్ సాంగ్‌లోనూ పాల్గొననున్నట్టు వార్తలు వైరల్‌గా మారాయి. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ జరగనుందని చర్చ నడుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాలుగు ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న ‘అఖండ’ సీక్వెల్ ఇది. ఇప్పటికే హైదరాబాద్, కుంభమేళా, హిమాలయాలు, జార్జియాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాణం చేపడుతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
Internal Links:
OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్..
External Links:
‘అఖండ 2’లో బాలయ్యతో సంయుక్త మీనన్ స్పెషల్ సాంగ్..