నేచురల్‌ స్టార్‌ నాని నటించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ వివేక్ ఆత్రేయ దర్శకత్వం తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎస్ జే సూర్య విలన్ గా నటించాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత మరో సారి హీరో నానితో జత కట్టింది ప్రియాంక అరుళ్ మోహన్. ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకొని, రిలీజ్‌ అయిన 20 రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయింది. ఈ నెల 26న (సెప్టెంబర్‌) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా (Netflix India) ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెల్పింది. ఎస్ జే సూర్య విలన్ గా, ప్రియాంక మోహన్ , సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ పలువురు కీలకపాత్రలు పోషించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *