‘సరిపోదా శనివారం’ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ‘దసరా’ సినిమాతో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని మరోసారి తన సత్తా చాటారు. ‘సరిపోదా శనివారం’ కూడా రూ.100 కోట్లకు పైగా వసూలు సాధించింది. చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు సరిపోయింది, మీరంతా (ప్రేక్షకులు) ఈ మూవీని ఆదరించి .. బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిపారు అని పేర్కొంది. ‘బాక్సాఫీస్ శివతాండవమే’ అనే పేరుతో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఆగ‌స్ట్ 29న విడుద‌లైన ఈ సినిమా హ‌వా మంచి వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘దసరా’తో నాని తొలిసారిగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా పలు విభాగాల్లో సైమా – 2024 అవార్డులు సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *