టిల్లు స్క్వేర్’తో మరో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న సిద్దు జొన్నలగడ్డ..‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. గతేడాది పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన, రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ఆగస్టు 6న గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా, మేకర్స్ షూట్ బిగిన్స్ అంటూ ఒక వీడియోను పంచుకున్నారు మరియు సిద్ధూ అభిమానులు అల్ ది బెస్ట్ భయ్యా అంటూ విషెస్ చెపుతున్నారు.
ముప్పై రోజుల పాటు హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించనున్నారు. ప్రధాన నటీనటులందరూ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సిద్ధూ కొత్త లుక్‌లో కనిపిస్తూ స్టైలిష్ మేకోవర్ సెట్ చేసుకున్నాడు. ఒక అబ్బాయి, అమ్మాయి కథతో పాటు స్నేహం, కుటుంబం, త్యాగం, సెల్ఫ్ లవ్‌కి సంబంధించిన కథ ఇదని తెలుస్తోంది.