కొన్నిసార్లు పాత ఫోటోలు చూస్తే భలే ఆసక్తికరం అనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ సహా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి హాజరైన ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్న ఒక చిన్న పాప ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ పాప మరెవరో కాదు మెగా కూతురు నిహారిక. నిజానికి మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. వాళ్ళందరూ తమదైన శైలిలో నటిస్తూ ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కుటుంబం నుంచి నిహారిక ఒక్కరే హీరోయిన్.
పెళ్లికి ముందు కొన్ని సినిమాలు చేసి పెళ్లి తర్వాత మానేసింది. ఇటీవలే భర్త నుంచి విడిపోయిన ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తూ నిర్మాణం పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. కమిటీ కుర్రాళ్లు నిహారిక నిర్మించగా, యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పిఠాపురం కూడా వెళ్లి తాను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ ప్రమోషన్స్ లో ఆమె వాడుతున్న డైలాగులు వైరల్ అవుతున్నాయి.