టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్. మీరా జాస్మిన్, సునీల్ , దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను లు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. తాజాగా స్వాగ్ టీం ట్రైలర్‌ను విడుదల చేసింది. మొన్ననే ఫ్రెంచ్ యువరాణిని ఏకాంతంగా కలిశాం అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఈ స్వాగ్ చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.