సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడం, అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అవడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి బంగారం అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మహారాజ అనే టైటిల్ కూడా వినిపిస్తుంది. ఈ రెండు టైటిల్ లు సూపర్ స్టార్ మహేష్ బాబుకి సరిగా సరిపోతుందని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్టున్నారు. త్వరలోనే మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా రాజమౌళి SSMB29 నుంచి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ ని జర్మనీలో స్టార్ట్ చేయనున్నట్టు పలు వర్గాలు తెలుపుతున్నాయి.