News5am, Telugu Movie News(15-05-2025): యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన 22వ సినిమా టైటిల్‌ను తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి “ఆంధ్రా కింగ్ తాలూకా” అనే పేరును ఖరారు చేశారు. పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గర వీఐపీల కోసం టికెట్లు తీసుకుంటున్న సమయంలో, రామ్ వచ్చి 50 టికెట్లు అడిగి, “ఏ తాలూకా?” అన్నవారికి “ఫ్యాన్స్” అని చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది.
ఈ చిత్రం ఒక అభిమాని బయోపిక్‌గా రూపొందుతోంది. ‘సాగర్’ అనే అభిమాని జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. “అభిమానులు సినిమాలను ప్రేమిస్తారు, కానీ ఈ సినిమా అభిమానులను ప్రేమిస్తుంది” అని చిత్రబృందం తెలిపింది. రామ్ ఇందులో సాగర్‌గా నటించగా, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర సూర్య కుమార్ అనే సూపర్‌స్టార్ పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వి.టి.వి. గణేష్ వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో భాగమవుతున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ, వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
More News:
Telugu Movie News:
అల్లు అర్జున్-అట్లీ సినిమా, రిలీజ్ డేట్ లాక్..
More Local Telugu News: External Sources
https://www.ap7am.com/tn/829390/ram-pothinenis-rapo22-titled-andhra-king-taluka