News5am, Telugu News Latest (20-05-2025): ఎన్టీఆర్ పేరు వినగానే అభిమానుల హృదయాలు ఉప్పొంగిపోతాయి. తన తాతగారు ఎన్టీఆర్ వారసత్వాన్ని గౌరవంగా మోస్తూ, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో చిన్నారి నటుడిగా తెరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్, 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా ద్వారా విజయాన్ని అందుకున్న తారక్, క్రమంగా ఎదుగుతూ తన తాత ఎన్టీఆర్ లా నటనలో మెరిశాడు. డాన్స్ లో మైకేల్ జాక్సన్ లా అలరించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ‘RRR’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ స్థాయి దేశవ్యాప్తంగా విస్తరించింది. దక్షిణా, ఉత్తరా అనే తేడా లేకుండా ఆయన నటనకు, నాట్యానికి ప్రేక్షకులంతా ముచ్చటపడుతున్నారు. ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది.
ఒక్కటి కాదు రెండు కాదు, పదుల సంఖ్యలో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతుండటమే తారక్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తుంది. ఎన్టీఆర్ అంటే కేవలం పేరు కాదు, అది ఒక బ్రాండ్. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు. ఇది కేవలం భారత్ వరకు పరిమితం కాకుండా విదేశాల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా జపాన్ లో తారక్‌కు భారీ స్థాయిలో అభిమానులున్నారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు, హీరోలు కూడా తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ‘‘హ్యాపీ బర్త్ డే బావ’’ అంటూ విష్ చేయడం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ‘‘బావ’’ అనడంతో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం మరోసారి హైలైట్ అయింది.
More News:
Telugu News Latest:
దడ పుట్టిస్తున్న ప్లేఆఫ్స్ లెక్కలు..
కాల్పుల విరమణ తర్వాత భారత్‌పై పాకిస్తాన్ దాడి..