తండేల్ సినిమాతో యువ సామ్రాట్ నాగ చైతన్య మంచి హిట్ అందుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ అయింది. మరోసారి చైతు, సాయి పల్లవి కాంబినేషన్ యూత్ ఆడియన్స్ ని మెప్పించింది. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. తండేల్ సినిమా గురించి ముందు నుంచి మేకర్స్ అంచనాలు పెంచుతూ వచ్చారు. వాటికి అనుగుణంగా సినిమా ఉంది. సినిమా బుకింగ్స్ భారీగా ఉన్నాయి. 1మిలియన్ బుకింగ్స్ కావడం చాలా ఈజీగా కనిపిస్తుంది. కేవలం మూడు రోజుల్లో 50కోట్లకు పైగా చేరుకునే అవకాశం ఉంది. టాక్ తో పాటే కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయని తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటివరకు చేసిన ఏ సినిమాకు రానటువంటి పాజిటివిటీ ఇంకా ఫ్యాన్స్ హంగామా తండేల్ సినిమాతో చూపిస్తున్నారు.
ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నేపథ్యంలో నాగార్జున తన తనయుడు నాగచైతన్యను మెచ్చుకున్నారు. ‘‘ప్రియమైన చైతు, నేను గర్వపడుతున్నాను. సరిహద్దులను దాటి పోతూ, సవాళ్లను ఎదుర్కొంటూ కళకు నీ గుండెను ఇచ్చినట్లు చూశాను. ‘తండేల్’ ఇది కేవలం ఒక సినిమా కాదు. నీ అభిరుచి, నీవు కష్టపడి సాధించిన విజయానికి నిదర్శనం. ’’ అంటూ రాసుకొచ్చారు. తండేల్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుంచి, సినిమా నుంచి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఇక సాంగ్స్ తో సూపర్ బజ్ క్రియేట్ చేయగా ఒక్కోసాంగ్ చార్ట్ బస్టర్ లిస్ట్ లో చేరింది. ఫైనల్ గా సినిమా కూడా అంచనాలను అందుకోవడంతో తండేల్, చైతన్య కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది.