Third Song from Parada Movie: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో, ‘సినిమా బండి’, ‘శుభం’ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల రూపొందించిన చిత్రం ‘పరదా’. ఇందులో దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ డొంకడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేశారు. ‘ఎగరేయ్ నీ రెక్కలే’ అంటూ సాగిన ఈ గీతాన్ని గోపీ సుందర్ సౌందర్యంగా స్వరపరిచారు. వనమాలి రచించిన పదాలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి.
ఈ పాటను రితేష్ జి రావు గాత్రంతో మరిచిపోలేని అనుభూతిగా మార్చాడు. “ఎగరేయ్ నీ రెక్కలే… కలిపేయ్ ఆ దిక్కులే…” అంటూ సాగిన ఈ పాటలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ముగ్గురు కారులో ప్రయాణిస్తూ కనిపించారు. ఈ ఎమోషనల్, హార్ట్ టచ్చింగ్ పాట ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘పరదా’ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది.
Internal Links:
తిరుమలలో కిరణ్ అబ్బవరం దంపతులు..
‘అతడు’ రీరిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్..
External Links:
పరదా మూవీ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్..