Tollywood: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా, హలో, చిత్రలహరి సినిమాల ఫేమ్ కలిగిన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘కొత్త లోక చాప్టర్ 1’. ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. భారతీయ సినిమాల్లో సూపర్ హీరో సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సందర్భంలోనే భారతదేశపు తొలి మహిళా సూపర్ హీరో కథగా ఈ సినిమా ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించింది. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ తన కెరీర్‌లోనే ఉత్తమ నటన కనబరిచింది.
మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 42 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. పదో రోజుకి చేరేసరికి వరల్డ్ వైడ్‌గా రూ. 167.51 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటింది. కేవలం భారతదేశంలోనే రూ. 83.61 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 83.91 కోట్లు సాధించి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో కూడా మంచి హిట్ అవుతోంది. ఇప్పటివరకు తెలుగులో ఎక్కువ కలెక్షన్లు సాధించిన మలయాళ సినిమా నస్లీన్ నటించిన ప్రేమలు (రూ. 13.5 కోట్లు). కానీ పెద్ద హడావిడి లేకుండా రిలీజ్ అయిన కొత్త లోక 10 రోజుల్లోనే రూ. 11 కోట్లు వసూలు చేసింది. ఇంకో రూ. 2.5 కోట్లు వసూలైతే, ఇది తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. కేరళలో కూడా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా ముందుకు సాగుతోంది.
Internal Links:
అనుష్క ‘ఘాటీ’ మూవీ పబ్లిక్ టాక్..
External Links:
తెలుగులోకి సైలెంట్ గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన డబ్బింగ్ సినిమా