Uppu Kappurambu Trailer: ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి కాంబినేషన్‌లోనే సుహాస్, కీర్తి సురేష్ జంటగా వస్తున్న చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. 90ల కాలంలో జరిగే ఈ సినిమాకు ఐ.వి. శశి దర్శకత్వం వహించగా, వసంత్ మరళీ కృష్ణ కథను అందించారు. ఎల్లనార్ ఫిల్మ్స్ పతాకంపై రాధికా లావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హాస్యం, సెటైర్‌తో పాటు ఒక సామాజిక సమస్యను ఈ సినిమా చర్చించనుందని మేకర్స్ తెలిపారు. ఇది ఒక ఆలోచింపజేసే సరదా ప్రయాణం అవుతుందని చెబుతున్నారు.
ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో, అంటే జూలై 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఇది స్ట్రీమ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజా ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
Uppu Kappurambu Trailer విషయానికొస్తే, ఒక ఊరిలోని స్మశానంలో నాలుగుగురికే స్థలం మిగిలి ఉంటుంది. దానిని పరిష్కరించేందుకు అధికారంలోకి వచ్చిన కీర్తి సురేష్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? అనేదే కథ. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వినోదంతో పాటు కీర్తి సురేష్ లుక్ కొత్తగా ఉండగా, బాబూ మోహన్ ఈ సినిమాతో మళ్లీ స్క్రీన్‌పై మెరుస్తుండటం విశేషం. సుహాస్ తన హాస్య టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ట్రైలర్ మొత్తానికి వినోదం, కొంత గందరగోళం కలగలిపిన ప్యాకేజీలా కనిపించింది.
Internal Links:
కింగ్‌డమ్ సినిమా రిలీజ్ డేట్ లాక్..
‘స్పెషల్ ఓపీఎస్2’ ట్రైలర్ రిలీజ్..
External Links:
‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ రిలీజ్..