షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య, తొలి చిత్రం ‘బేబీ’తోనే స్టార్ గా మారింది. ప్రస్తుతం ఆమె హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘జాక్’ సినిమాలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వైష్ణవి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ప్రచారం జరుగుతోందని, కానీ ఆ ప్రచారం కారణంగా చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలని ఆలోచించడం లేదని వైష్ణవి అన్నారు. ఇండస్ట్రీలోకి రావాలనే ప్రయత్నమే చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయని, దానికి ఆమె ఒక ఉదాహరణ అని ఆమె అన్నారు. అవకాశాలు రావు అని భయపడి ఆగిపోయే బదులు గట్టిగా ప్రయత్నిస్తే అవకాశాలు మీ తలుపు తడతాయని, ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారికి ఇదే తానిచ్చే సలహా అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *