Veeramallu Overseas Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన “హరిహర వీరమల్లు” చివరకు థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్ ప్రీమియర్ షోలకు వచ్చిన స్పందన ప్రకారం, ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఉన్నా, కథాపరంగా చాలా పాతదిగా, స్క్రీన్‌ప్లే ఓల్డ్ స్కూల్‌గా ఉందని చెప్పొచ్చు. మొదటి భాగం బాగానే కొనసాగింది. పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్, ఎంట్రీ, కుస్తీ ఫైట్ వంటి సీన్లు అభిమానులను ఉత్సాహపరిచాయి. స్క్రీన్‌ప్లే పురాతనంగా ఉన్నా, ఎం.ఎం. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలాన్నిచ్చింది. ఇంటర్వెల్ వరకు ఓకే అనిపిస్తుంది.
అయితే సెకండ్ హాఫ్ ప్రారంభమైన వెంటనే సినిమా స్థాయిలు తగ్గడం మొదలవుతుంది. దర్శకుడు కథను పక్కనపెట్టి కొన్ని ఎలివేషన్ సీన్లకే ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. గోల్కొండ నుండి ఢిల్లీ వరకు హీరో ప్రయాణం చాలా బోరింగ్‌గా ఉంటుంది. VFX సాధారణంగానే ఉండగా, డబ్బింగ్ లో కూడా లిప్-సింక్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకునేలా లేదు. మొత్తంగా కీరవాణి, పవన్ కళ్యాణ్, తోట తరణి మాత్రమే తమ పనిని బాగానే చేశారు. ఫస్ట్ హాఫ్ క్రిష్ డైరెక్ట్ చేసి, సెకండ్ హాఫ్ మరొకరు తీసినట్టు అనిపించేలా ఉంది.
Internal Links:
External Links:
వీరమల్లు ఓవర్సీస్ రివ్యూ.. అద్భుతం