చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర ‘ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబందించిన ఒక చిన్న అప్‌డేట్ వచ్చింది. తాజాగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ‘విశ్వంభర ‘ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉండగా, అందులో మూడు పాటలకు షూటింగ్ కంప్లీట్ అయింది. ఇంకో రెండు పాటలు మిగిలి ఉన్నాయని దర్శకుడు తెలియజేసారు. ఆగష్టు నెల ఆఖరి వరుకు షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా (విశ్వంభర ) విడుదల కానుంది.