టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న సినిమా విశ్వం. శ్రీను వైట్ల ( దర్శకత్వంలో Gopichand 32గా తెరకెక్కుతుంది). గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి.
తాజాగా విశ్వం ఫస్ట్ సింగిల్ మొరాకన్ మగువను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్, కావ్య థాపర్ సూపర్ స్టైలిష్ స్టెప్పులతో సాగుతున్న పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్టు విజువల్స్ చుస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో నరేష్, ప్రగతి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, అజయ్ ఘోష్‌లు కీలక పాత్రలు పోషించారు.