పాన్ ఇండియన్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాతో నార్త్ మార్కెట్‌లో తన బ్రాండ్‌ను ప్రమోట్ చేద్దామనుకుంటే పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రిపుల్ ఆర్, దేవర చిత్రాలతో నార్త్ బెల్ట్ లో తనకంటూ ఓ మార్కెట్ ఏర్పరుచుకున్నాడు మాస్ మ్యాన్ ఎన్టీఆర్. అయితే పాన్ ఇండియా చిత్రాలకు బదులు నేరుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అందుకే బీటౌన్ అరంగేట్రానికి సిద్ధమైంది. వార్ 2లో హృతిక్ రోషన్ తో తారక్ ఢీకొనబోతున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వార్ 2ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది యశ్ రాజ్ ఫిల్మ్స్. ఆగస్టు 14న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఏడాది క్రితమే ఎనౌన్స్ చేశారు మేకర్స్. అయితే బాలీవుడ్ వర్గాల్లో కొత్త రూమర్ వినబడుతోంది. వార్ 2ను ఈ ఏడాది ఆగస్టులో తీసుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని టాక్. ఇంకా భారీ షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉందని, దీనికి కొంత టైం పడుతుందని అందుకే అనుకున్న డేట్ కు సినిమా రాకపోవచ్చునని బజ్ నడుస్తోంది. నార్త్ బెల్ట్ లో తారక్ తెరంగేట్రాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకొందామని వెయిట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ న్యూస్ ఇరిటేట్ చేస్తోంది.