జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు కీలకమైన బడ్జెట్తో నిర్మిస్తున్నారు, దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ కాగా, ఇటీవల విడుదలైన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది.
కాగా దేవరా ఓవర్సీస్ ప్రీ సేల్స్ మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు 1.67 మిలియన్ ప్రీ సేల్స్ వసూలు చేసి రికార్డును బద్దలు కొట్టింది. ఇక టికెట్స్ బుకింగ్స్ విషయంలోనూ దేవర తన సత్తా చాటుతోంది. ఇప్పటివరకు 50,000 పైగా టికెట్స్ బుక్ అయి, రిలీజ్ కు 7 రోజులు ఉండగా ఇంతటి భారీ స్థాయి బుకింగ్స్ సాధించిన సినిమాగా దేవర నిలిచింది. రిలీజ్ నాటికి 2.5 మిలియన్ కు పైగా రాబట్టి బాహుబలి – 2 ప్రీ సేల్స్ ను దేవర క్రాస్ చేస్తుందని ట్రేడ్ అంచనా. ఇదిలా ఉండగా ఈ నెల 22 న భారీ స్థాయిలో దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, రాజమౌళి అతిధులుగా రానున్నట్టు తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించిన దేవర సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.