రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో హింసలు చేలారేగాయి. హింసలు చెలరేగడంతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది పోలీసులు కూడా మరణించారు. ఘర్షణలు ఎక్కువ కావడంతో, ప్రభుత్వం అప్రమత్తమైంది. దింతో దేశమంతటా కర్ఫ్యూ విధించారు. బంగ్లాదేశ్ మొత్తం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో ఆర్మీ రంగంలోకి దిగి వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. బంగ్లాదేశ్ మొత్తం ఇంటర్‌నెట్‌ సేవలను సైతం నిలిపివేశారు. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో, చోటు చేసుకున్న గొడవల్లో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చలకు రావాలని ప్రధాని షేక్ హసీనా పిలుపు ఇచ్చినప్పటికీ వారు తిరస్కరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. వరసగా బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో భారతీయులు పౌరులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే భారతీయ పౌరులు తమను సంప్రదించాలంటూ భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఇందుకు సంబంధించి భారత రాయబార కార్యాలయం ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *